Shiva Panchakshara Strotram in Telugu: Om Namah Shivaya!
Shiva Panchakshara Stotram in Telugu – Om Namah Shivaya!
Find below the meaning and full Shiva Panchakshara Stotram in Telugu
నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు కలవాడు
పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యుడు
శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు
పంచాక్షరీ మహ మంత్రంలో ‘న’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునికి వందనం.
మందాకినీ నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు
నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు,
మందారం మరియు ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు,
పంచాక్షరీ మహ మంత్రంలో ‘మ’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునికి వందనం.
మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు,
దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు,
నీలకంఠుడు, వృషభధ్వజుడు,
పంచాక్షరీ మహ మంత్రంలో ‘శి’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునికి వందనం.
వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన ముని శ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు,
విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య, చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు,
పంచాక్షరీ మహ మంత్రంలో ‘వ’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునికి వందనం.
యజ్ఞస్వరూపుడు, జటాధరుడు, త్రిశూలం ధరించిన వాడు, సనాతనుడు, తేజస్సు కలవాడు,
నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు,
పంచాక్షరీ మహ మంత్రంలో ‘య’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునికి వందనం.
పంచాక్షరీ మంత్రమును ఎవరైతే శివుని సన్నిధిలో జపిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులంతా విశ్వసిస్తారు. పంచాక్షరీ మంత్రాన్ని జపించిన వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ పరమ శివుడు వారికి అన్ని వేళలా అండగా ఉంటాడు.
Shiva Panchakshara Stotram in Telugu
ఓం నమ: శివాయ శివాయ నమ: ఓం
ఓం నమ: శివాయ శివాయ నమ: ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై ‘‘న” కారాయ నమ: శివాయ ।। 1।।
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై ‘‘మ” కారాయ నమ: శివాయ ।। 2 ।।
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై ‘‘శి” కారాయ నమ: శివాయ ।। 3 ।।
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై ‘‘వ” కారాయ నమ: శివాయ ।। 4 ।।
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై ‘‘య” కారాయ నమ: శివాయ ।। 5 ।।
పంచాక్షరమిదం పుణం య: పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ।।
Must Read:Shiva Panchakshara Mantra Strotram Lyrics
Must Read:Mahadev status videos
Must Read:Best Mahadev Attitude Status Quotes
Must Read:Shiv Namaskaratha mantra lyrics
For more articles like, “Shiva Panchakshara Stotram in Telugu”, do follow us on Facebook, Twitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.